Sep 25,2023 21:18

ఎంపికైన విద్యార్థులతో సిబ్బంది

  కడప అర్బన్‌ పశ్చమ గోదావరి జిలా ్ల(మార్టేరు)లో ఈ నెల 29 నుంచి అక్టోబర్‌ 02 వరకు నిర్వహించబోయే 9 వ ఛాంపియన్‌ షిప్‌ బాస్కెట్‌ బాల్‌ పోటీలకు జిల్లా బాస్కెట్‌ బాల్‌ క్రీడా ప్రాంగణంలో ఎంపికలు నిర్వహించారు. వైఎస్‌అర్‌ జిల్లా జట్టు తరపున తమ కళాశాలలో బిటెక్‌ తతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈడిగ సూర్య ప్రకాష్‌ (సి.ఎస్‌.ఈ), గరిగేని హరి కష్ణ (ఈ. ఈ.ఈ) ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి. ఎస్‌ ఎస్‌ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలమేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి (నాని) ఎంపికైన విద్యార్ధులను అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల అడ్మనిస్ట్రేటివ్‌ మేనేజర్‌ పి.ప్రేమ్‌ కుమార్‌,ఫిజికల్‌ డైరెక్టర్‌ వంశీ నాయక్‌, నారాయణ పాల్గొన్నారు.