Jul 20,2023 21:52

బృంద సభ్యులను సత్కరిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట సమీపంలో లింగంగుంట్ల పరిధిలో వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రభుత్వాస్పత్రిని పాపులేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కేరళ డాక్టర్ల బృందం గురువారం పరిశీలించింది. వీరికి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బివి రంగారావు స్వాగతం పలికారు. వివిధ విభాగాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతోపాటు రోగులనూ అడిగి వివరాలను బృందం సేకరించింది. ఓపీ, ఇతర రికార్డులు, మందులను పరిశీలించారు. నివేదికను కేంద్ర వైద్య శాఖకు అందజేస్తామని బృందం తెలిపింది. బృందంలో డాక్టర్‌ అనిత కుమారి కెఆర్‌, డాక్టర్‌ సబిత దాస్‌ డీఎస్‌ ఉన్నారు. కార్యక్రమంలో డిపిఒ వన్నూరు బాషా, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ నీలకంఠేశ్వరరావు, డాక్టర్‌ నాగపద్మజ, పాల్గొన్నారు.