Jul 07,2023 21:37

జిల్లా అభివద్ధికి ప్యాకేజీ ప్రకటించాలి : సిపిఎం

 జమ్మలమడుగు రూరల్‌ : జిల్లా అభివద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి రూ.10,000 కోట్లతో ప్యాకేజీని ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ కోరారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి కార్యాలయంలో ఆయన సిపిఎం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ నుంచి రాష్ట్రపతులను, ప్రధాన మంత్రులను, కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రులను కూడా ప్రజలు గెలిపించి పంపారన్నారు. రాయలసీమ అభివద్ధికి ముఖ్యంగా జిల్లా అభివద్ధికి ఏమాత్రం పాటుపడలేదన్నారు. కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని విభజన చట్టంలో ఉన్నా దాని గురించి కేంద్రంలో ఊసే లేదన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి రెండుసార్లు ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేసినప్పటికీ పురోగతి లేదన్నారు. రూ.7000 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, దశలవారీగా రూ.8800 కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఆనవాలే కనపడలేదన్నారు. జిల్లాను వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి కూడా అభివద్ధి చేస్తారని జిల్లా ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే ఆయన మాత్రం జిల్లాకు ఏ విధమైనటువంటి నిధులు కేటాయించడం లేదన్నారు. 9న గండికోట హోటల్‌ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసేందుకు వస్తున్న ముఖ్యమంత్రి ప్రపంచంలోనే గండికోట ప్రసిద్ధిగాంచిందని చెప్పుకుంటున్నప్పటికీ గడిచిన నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇంతవరకు గండికోటకు నిధులు కేటాయించకపోవడం బాధాక రమన్నారు. కనీసం గండికోట లోపల పర్యాటకుల కోసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. శంకుస్థాపన సమయంలోనైనా గండికోట అభివద్ధికి హామీ ఇవ్వాలని కోరారు. ఇంతవరకు జిల్లాలో కేవలం ఒక్క పులివెందులకు మాత్రమే రూ.110 కోట్లు ప్రకటించి నిధులు మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బెల్లం మనోహర్‌, జమ్మలమడుగు కార్యదర్శి శివ నారాయణ, సిఐటియు నాయకులు దాసరి విజరు, దాసు, కొండయ్య, వినరు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌