ఫొటో : పథకాలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
జి.కొండారెడ్డిపల్లిలో 'జగనన్న సురక్ష'
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని జి .కొండారెడ్డిపల్లిలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఆ పథకాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్ద ఏవైన సమస్యలు ఉంటే వాటిని తీసుకొని వాటికి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ సయ్యద్‌ఇక్బాల్, ఎంపిడిఒ విజయ భాస్కరరావు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.










