Jul 24,2023 00:44

గుంటూరు జిల్లా ప్రతినిధి: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ -ఆసుపత్రి అమలు సేవలు పక్కాగా అమలు చేస్తామని సూప రింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. అవుట్‌ పేషెంట్‌ విభాగంలోని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నిర్వహించే రిజస్ట్రేషన్‌ విభాగాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా తో డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి అమలు కోసం నలు గురు అధికారులను తాత్కాలికంగా నియమించామన్నారు. వీరి పర్యవేక్షణ కోసం పరిపాలన అధికారిని కూడా ఏర్పాటు చేసామన్నారు. ఉదయం ఏమినిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తిగా అన్నీ ఒ పి రిజిస్ట్రేషన్‌ లు ఆధార్‌ కార్డు ద్వారా అనుసంధానం చేయించడానికి నిర్ణయించామన్నారు. డి ఈ ఒ లకు తగు సూచనలు ఇవ్వాల్సిందిగా ఈ ఆసుపత్రి జిల్లా కో ఆర్డినేటర్‌ ప్రదీప్‌ కు ఆదేశించాం.రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ఆసుపత్రి అమలు చేసే విధంగా ప్రణాళిక లను సిద్ధం చేస్తున్నాం. తానే స్వయంగా కంప్యూటర్‌ ఆపరేట్‌ చేసి ఈ నలుగురి డి ఈ ఒ లకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.