ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్డ్రో పెడిక్ విభాగం లో శుక్రవారం మోకాలు గాయల ఆర్డ్రో స్కోపి సర్జరీ రాష్ట్ర స్థాయి వైద్య విద్య కార్యక్రమం జరిగింది. సి యం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమాజ్యోతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి హాజరయ్యారు. వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాల ద్వారా పీజీ వైద్య విద్యార్థులకు వత్తి నైపుణ్యం పెరుగుతుందన్నారు. క్లిష్టమైన శస్త్ర చికిత్స లు పీజీ లకు శిక్షణ ఇచ్చేందుకు సి యం ఈ ఎంతో ఉపయోగం అన్నారు. అనంతరం శవాగారంలో నాలుగు మత దేహలపై మోకాలు లోపల నరాలు తెగినప్పుడు.. ఆర్డ్రో స్కోపి ద్వారా సర్జరీ చేసే విధానం పై మెలుకువలను సీనియర్ వైద్యులు పీజీ లకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు వర ప్రసాద్, ఎస్ ఎస్ వి రమణ, డాక్టర్ వివి నారాయణరావు, డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాస్, డాక్టర్ ఎస్ అమరనాధ్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ పాపారావు, డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ సందీప్, డాక్టర్ చెతన్య, డాక్టర్ సతీష్ బాబు, డాక్టర్ మదుల పాల్గొన్నారు.










