Oct 04,2023 21:33

ఉక్కపోతతో రిమ్స్‌లో ఆరుబయట నిద్రిస్తున్న బాలింతలు, రోగులు

 కడప ప్రతినిధి : జిల్లా ప్రభుత్వ సర్వజనాస్పత్రికి పురిటినొప్పులు తప్పడం లేదు. రాయలసీమ జిల్లాల నుంచి జిల్లా ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్య సేవల నిమిత్తం ప్రతిరోజూ వందలాది రోగులు రావడం తెలిసిందే. సుఖప్రసవాల సేవలు మెరుగుపడిన నేపథ్యంలో గర్భిణులు తాకిడి గణనీయంగా పెరిగింది. ఇటువంటి పాజిటివ్‌ పరిస్థితుల నేపథ్యంలో లేబరువార్డు, కాన్పులవార్డుల్లో మౌలిక వసతులను కల్పించడంలో జిజిహెచ్‌ అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవ హరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా ప్రభుత్వ సర్వజనాస్పత్రి మౌలిక వసతుల కల్పనలో నీరస పడింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో లేబర్‌, కాన్పుల వార్డుల్లో ఉక్కపోతను భరించలేని గర్భిణులు, బాలింతలు వెయిటింగ్‌ హాలుకు రోజుల వ్యవధిలోని పిల్లలను తీసుకుని బారులు తీరుతున్న దృశ్యం కనిపించింది. జిల్లా ప్రభుత్వ సర్వజనాస్పపత్రిలో సుఖప్రసవాల సేవలు గణనీయంగా మెరుగు పడిన నేపథ్యంలో ప్రతి రోజూ వందలాది మంది గర్భిణులు రావడం సర్వసాధారణమైంది. వైద్యసేవల అనంతరం ప్రతిరోజూ సుమారు 40 నుంచి 50 సుఖ ప్రసవాలు చేస్తున్నారు. ఇదే సేవలకు ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్ప త్రిల్లో ఒక్కో సుఖప్రసవానికి రూ.30 వేలు, ఆపరేషన్‌ అవసరమైన వారికి రూ.50 వేలకుపైగా ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో పేదలతోపాటు సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి ప్రభుత్వ సర్వ జనాస్పత్రి బారిన పడుతుండడం గమనార్హం. ఇటువంటి పాజిటివ్‌ పరిస్థితుల నేపథ్యంలో జిజిహెచ్‌ యంత్రాంగం వైద్యసేవల మీద కల్పించిన నమ్మకం, మౌలిక వసతుల కల్పనలో కల్పించడం లేదని చెప్పవచ్చు. తరుచుగా ఫ్యాన్‌లు ఎసి యంత్రాలను అప్‌డేట్‌ చేయక పోవడంతో తరుచుగా మరమ్మతుల బారిన పడుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకే బెడ్‌ మీద ఇద్దరు, ముగ్గురు బాలింతలు ఉండి సేవలు పొందడానికి సిద్ధ పడు తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో గర్భిణులకు మౌలిక వసతుల కల్పనపై జిజిహెచ్‌ యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తరుచుగా పనిచేయని ప్యాన్‌లు, ఎయిర్‌ కండిషన్‌ యంత్రాల నేపథ్యంలో బాలింతలు పురిటి బిడ్డలను వెయింటింగ్‌ హాలుకు తీసుకొచ్చి గుడ్డల సహాయంతో విసురు తూ పిల్లలను ఉక్కపోత బారి నుంచి తప్పించే ప్రయత్నం చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. దీనిపై లేబర్‌వార్డు హెచ్‌ఓడిని సంప్రదిం చగా ఫ్యాన్స్‌, ఎసిలు సక్రమంగా పని చేస్తున్నాయని, బాలింతలు ఎం దుకు బయటికి వెళ్తున్నారో పరిశీలిస్తామని చెబుతున్నారు. బాలింతలు బెడ్‌ మీద నుంచి బయటికి రావడానికి సెక్యూరిటీ ఏమైందని, పిల్లలు, బాలింతలు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడితే పరిస్థితేమిటని ప్రశ్నిం చగా సెక్యూరిటీని పటిష్టం చేస్తామని పేర్కొనడం గమనార్హం. దీనిపై సూపరింటెండెంట్‌ను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.