Aug 26,2023 21:24

జిజిహెచ్‌కు 'చెద'

జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాలకు చెదపట్టింది. ప్రభుత్వం క్రిమికీటకాదులు మొదలు చెదులు నివారణ కాంట్రాక్టును తెలంగాణకు చెందిన శ్రీసాయి సెక్యూరిటీస్‌ ఏజెన్సీకి అప్పగించిం ది. సదరు కాంట్రాక్టర్‌ తెలంగాణలో ఉన్న నేపథ్యంలో జిజిహెచ్‌ కాంట్రాక్టు పర్యవేక్షణ భారంగా మారినట్లు కనిపిస్తోంది. ఫలితంగా జిజిహెచ్‌ వైద్య విద్యార్థినుల హాస్టళ్లలో చెదలు నివారణ ప్రశ్నార్థకంగా మారింది. హాస్టల్‌ వైద్య విద్యార్థులకు పాట్లు తప్పడం లేదు. దీనిపై జిజిహెచ్‌ ప్రిన్సిపల్స్‌ పర్యవేక్షణ కొరవడిన నేపథ్యంలో చెదల నివారణ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాలకు పర్యవేక్షణ కొరవడింది. జిజిహెచ్‌ పరిధిలో యుజి ఉమెన్స్‌ హాస్టల్‌, పీజీ హాస్టల్‌, హౌస్‌ సర్జన్స్‌ హాస్టల్‌, బాయిస్‌ హాస్టల్స్‌ ఉన్నాయి. ఉమెన్స్‌ హాస్టళ్లలో 200 మంది యుజి వైద్య విద్యార్థినులు నివసిస్తున్నారు. ప్రతి గదికి ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున ఉంటున్నారు. ఎన్నో ఆశల, కలల మధ్య వైద్య విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థినులకు ఇక్కడ కల్పించిన వసతి సదుపాయాలను చూసి నివ్వెర పోతున్నారు. విద్యార్థులకు కేటాయించిన గదుల తలుపుల దగ్గర నుంచి ర్యాకుల వరకు చెదలు స్వైరవిహారం చేస్తోంది. హాస్టల్‌ తలుపుల దగ్గర నుంచి ర్యాకుల్లో ఏర్పాటు చేసుకున్న మెడిసిన్‌ పుస్తకాలకు, దుస్తులకు సైతం చెదలు వ్యాపిస్తోంది. ఫలితంగా వైద్య విద్యార్థినులు తరుచుగా పుస్తకాలను, దు స్తులను, దుప్పట్లను దులుపుకుని తరుచుగా మార్చుకోవాల్సి వస్తోంది. హాస్టల్‌ను ఆసాంతం తలుపులను, ర్యాకుల (కబోర్డులు) చెక్కలను పరిశీలిస్తే చెదలు పట్టి తినేస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. నెలల తరబడి హాస్టళ్ల నిర్వ హణను పట్టించుకునే నాధుడు కరువు కావడంతో హాస్టళ్ల తలుపులను తరుచుగా మార్చుకోవాల్సి వస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిజిహెచ్‌లో పెస్ట్‌కంట్రోల్‌ సిబ్బ ంది, జిజిహెచ్‌ ప్రిన్సిపల్‌, కాంట్రాక్టర్‌ పర్యవేక్షణను పరిశీ లిస్తే అంతులేని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి నెలా పెస్ట్‌కంట్రోల్‌ కాంట్రాక్టర్‌కు జిజిహెచ్‌ బాధ్యులు బిల్లుల చెల్లిం పులు ఎలా చేస్తున్నారనే విమర్శ పెద్దఎత్తున విని పిస్తోంది. జిజిహెచ్‌ హాస్టళ్లలో చెదల స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో పరిశీలించిన తర్వాత బిల్లులు చెల్లింపులు చేయ డంలోనే మతల బేమిటనే వాదన వినిపిస్తోంది. ప్రిన్సిపళ్లతో, కాంట్రాక్టర్ల కుమ్మక్కు ఫలితంగానే ఇటువంటి అద్వాన్న పనితీరును చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. జిజిహెచ్‌ పర్యవేక్షణ బాధ్యతల్ని స్వీకరించిన కార్పొరేషన్‌ కమిషనర్‌ కార్పొరేషన్‌ తరహాలోనే జిజిహెచ్‌ ఆవరణంలోని పిచ్చి, కంపచెట్లను తొలగించి, చెదల నివారణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదన వినిపిస్తోంది.