Sep 17,2023 01:15

ప్రజాశక్తి - బాపట్ల రూరల్
ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా మండలంలోని వెదుళ్ళపల్లి జెడ్పీ హై స్కూల్‌లో ఓజోన్ పొర పరిరక్షణ ఆవశ్యకతను జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు  కోట వెంకటేశ్వరరెడ్డి వివరించారు. సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలను నిలువరించగల ఓజోన్ పొరను రక్షించుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఉందన్నారు. అడవుల సాంద్రతను పెంచుకోవడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, రిఫ్రిజిరేటర్లు, రసాయన పదార్థాలు వాడకాన్ని తగ్గించడం వంటి చర్యల ద్వారా జీవరాశిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓజోన్ పొరకు రంద్రాలు పడ్డాయని శాస్త్ర వేత్తలు హెచ్చరించిన కారణంగా మాంట్రియల్  ప్రోటోకాల్ అమలు తక్షణవసరమని సభకు అధ్యక్షత వహించిన జెవివి జిల్లా నాయకులు వై భాస్కరరావు అన్నారు. కార్యక్రమంలో హై స్కూలు ఉపాధ్యాయులు కె రామచంద్రరావు, రాంబాబు, సుభాని, భవాని, సుప్రియ, కళ్యాణి పాల్గొన్నారు.