Jul 12,2023 17:27

సమావేశంలో మాట్లాడుతున్న కెవీపీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వి యేసు రత్నం తదితరులు

జీవో110 ప్రకారం లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలి
కెవీపీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వి యేసు రత్నం
ప్రజాశక్తి - ఆత్మకూర్

      రాష్ట్రంలో యూనివర్సిటీలలో జీవో నెంబర్ 110 ప్రకారం కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం నంద్యాల జిల్లా గౌరవాధ్యక్షుడు వి యేసు రత్నం జిల్లా నాయకులు పాతకోట భాస్కర్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఎం నరసింహ నాయక్ మాల మహానాడు సీనియర్ నాయకులు మల్లె ఎలీషా పాతకోట రమేష్  డిమాండ్ చేశారు బుధవారం నాడు సుదర్శన వర్మ స్మారక భవనంలో వారు మాట్లాడుతూ  దళితులు మా బంధువులు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళిత నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలోని 25 యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులను ఎస్సీలకు 16% ఎస్టిలకు 6%  రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలని జీవో నెంబర్ 110 ఉన్నప్పటికీ రాష్ట్రంలో అమలు కావడం లేదు యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు ఇష్టానుసారంగా కాంట్రాక్టులు భర్తీ చేస్తూ దళితులకు రావాల్సిన ఉద్యోగాలను అమ్ముకుంటూ ఉన్నారు దీనివల్ల చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు రాక వయసు పెరిగిపోయి అన్యాయానికి గురవుతున్నారు అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దళితుల పట్ల గిరిజనుల పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా 110 జీవోని అమలు చేసి యూనివర్సిటీలలోని కాంట్రాక్టు లెక్చరర్ల భర్తీలో రిజర్వేషన్స్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు