గుంటూరు :రవాణా రంగ కార్మికుల మెడపై కత్తిలా ఉన్న జిఒ 21 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 6న చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు గుంటూరు తూర్పు కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస రావు పిలుపు నిచ్చారు. బి.ఆర్.స్టేడియం ఆటోస్టాండ్ విసృత సమావేశం బుధవారం వేజెండ్ల క్వారీ వద్ద నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ మోటార్ వాహన చట్ట సవరణ డ్రైవర్లకు, రవాణా రంగం కార్మికులకు నష్టం కలిగిస్తుందన్నారు. చట్ట సవరణపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేయటంతో కేంద్రం కుట్ర పూరితంగా రాష్ట్రాల ద్వారా చట్ట సవరణలో ప్రతిపాదించిన ప్రమాదకరమైన అంశాలను అమలు చేయించేందుకు సిద్ధం అయ్యిందని విమర్శిం చారు. కాగా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఏపీలో అమలు చేయ టానికి రాష్ట్ర ప్రభుత్వం జిఒ 21 తెచ్చి, పెద్ద ఎత్తున డ్రైవర్లపై భారాలు వేయటంతోపాటు, చిన్న చిన్న కారణాలకూ డ్రైవర్లకు పెద్ద స్థాయిలో శిక్షలు వేసే విధంగా జీఒ తేవటం అన్యాయమన్నారు. సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్.కె మస్తాన్‌వలి నాయకులు ఎస్.కె ఖాసింషహీద్ ప్రసంగించారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్.కె సమీవుల్లా ప్రభుదాస్‌ను ఎన్ను కున్నారు. సమావేశంలో షబ్బీర్, చిన్న, ఖాసిం ,శ్రీనివాసరావు, మౌలాలి పాల్గొన్నారు.










