ప్రజాశక్తి-అద్దంకి: ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని ఎంఎస్ ఎంసిహెచ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, గ్యాస్ట్రో లేబర్ సర్జన్ చిడిపోతు వెంకట్రావు అన్నారు. ఆదివారం మండలంలోని నాగులపాడు గ్రామంలో మంగమూరి రాఘవులు వెంకటసుబ్బమ్మ జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మందికి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. 30 మందికి ఈసీజీ, షుగర్, బిపి పరీక్షలు నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. గుండె జబ్బుల సమస్యలపై గుండె శస్త్ర చికిత్స వైద్య నిపుణులు కరి వీరభద్రస్వామి మాట్లాడుతూ ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా ఉన్నాయని, ఆహారంలో మార్పుల ద్వారానే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. గుండెకు సంబంధిం చిన సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్యులు వడ్లవల్లి జ్యోతి, ఎస్‌డి హాకీమ్ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.










