జీతం తక్కువ.. చాకిరి ఎక్కువ..
శ్రీ పారిశుధ్య కార్మికులకు
సమాన పనికి.. సమాన
వేతనం ఎక్కడ..?
శ్రీ ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి
తొలగింపు
శ్రీ 25న చల్లో విజయవాడ
ప్రజాశక్తి- తిరుపతిటౌన్:
తిరుపతి నగరం ప్రాముఖ్యత కలిగిన యాత్రాస్థలం. అంతేకాకుండా స్మార్ట్‌సిటి నేపథ్యంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నారు. నగరంలో నూతనంగా 12 మాస్టర్‌ప్లాన్ రోడ్లు వేశారు. దీనికి తోడు రూ.648కోట్లతో ఏడు కిల్లోమీటర్ల వరకు తిరుమలకు వచ్చే యాత్రికుల కోసం నిర్మించిన శ్రీనివాస సేతును సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ మధ్యే ప్రారంభించారు. తిరుపతి నగరపాలక జనభా మూడు లక్షలు ఉంటే రోజూ తిరుమల, తిరుపతికి లక్షమందికి పైగా యాత్రికులు వస్తూపోతూ ఉంటారు. అంటే దాదాపు రోజుకు నాలుగు లక్షల మంది.
ఇదిలా ఉండగా నగర పాలక సంస్థలో 1200 మంది కాంట్రాక్టు, పర్మినెంట్ కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 12 మాస్టర్‌ప్లాన్ రోడ్లు వేయడం వల్ల కొంత పనిభారం పెరిగిందనే చెప్పవచ్చు. పారిశుధ్య కార్మికులకు సీనియార్టీని బట్టి రూ.18 నుంచి 15వేలు, రూ.12వేలు వేతనం ఇస్తున్నారు. ఇందులో ఇఎస్‌ఐ, పిఎఫ్ పేరుతో ఒక్కోక కార్మికుడికి సుమారు రూ.2వేల నుంచి రూ.2,500ల వరకు కోతలుపోనూ మిగిలిన జీతం చేతికి వస్తుంది.
రోజుకు ఎనిమిది గంటలు పనిచేసే పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు వీధుల్లో రోడ్లు ఊడ్చుడం, కాలువలు మురుగు తీయడం, రోడ్లో ఉన్న చెత్తను తొలగిండంతో పాటు ఇంటింటికీ వెళ్లి తడిపోడిచెత్త సేకరిస్తూ ఉంటారు. 1200 మంది పారిశుధ్య కార్మికులతో పాటు వార్డు అడ్మిన్లులు ప్రతి డివిజన్‌కు ఉంటారు. కార్పొరేషన్ పరిధిలో 101 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి 50 ఇళ్లకు వార్డు వాలంటీర్లు సుమారుగా రెండు వేలమంది ఉన్నారు.
ముఖ్యంగా తిరుపతి లాంటి నగరంలో నిత్యం విఐపిలు వస్తుపోతుంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, ఇతర రాష్ట్రాల గవర్నర్లుతో పాటు ముఖ్యమంత్రులు, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి స్వాములు, మఠాధిపతులు వస్తూ ఉంటారు. వీరి కోసం రాత్రిపగలు తేడా లేకుండా పారిశుధ్యకార్మికులు పనులు చేస్తూనే ఉంటారు. వరదలు, తుఫానులు వస్తే ఇక వీరు లేకపోతే ఎటువంటి సహయక చర్యలు చేపట్టలేని పరిస్థితి.
పండగలు వస్తే సెలవులు ఉండవు, అనార్యోగనికి గురైన సెలవులు ఉండవు. సెలవు పెడితే వారిస్థానంలో ఇంకోకరిని తీసుకోవచ్చి పనిలో పెడితే తప్ప సెలవులు ఇవ్వరు. కార్పొరేషన్‌లో ఇటీవల నూతనంగా శెట్టిపల్లి పంచాయతీ వీలీనం చేశారు. అక్కడ కూడా పారిశుధ్య పనులు చేయాలి. స్మార్టుసిటీ పథకంలో శ్రీనివాస సేతు 7 కిల్లోమీటర్ల వరకు బ్రిడ్జి నిర్మించారు. అక్కడ పారిశుద్య పనులు ఈకార్మికులే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీనివాస సేతు ఇటు చంద్రగిరి, అటు తిరుపతి నియోజకవర్గానికి వస్తుంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో వచ్చే శ్రీనివాససేతు మామిడి మార్కెట్ యార్డు నుంచి పారిశుధ్య పనులు ఎవరు చేయాలనేది ఇంతవరకు అధికార్లు నిర్ణయం తీసుకోలేదు.
2019 హమీలు అమలు ఎక్కడ..?
మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేస్తామని అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ మోహన్‌రెడ్డి అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రి అయిన తరువాత విస్మరించారని కార్మికులు వాపోతున్నారు. ఎన్నికల మ్యానిఫోస్టులో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ప్రకటించారు కానీ అమలుకు నోచుకోవడం లేదు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పి నేటికి అమలు చేయకపోగా అప్కాస్ పేరుతో జీతాలు పెంచకపోగా, రెగ్యులర్ గురించి ప్రభుత్వం మాట మాట్లాడడం లేదు.
ప్రశ్నిస్తే చర్యలు..
పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచాలని, పనిభారం తగ్గించాలని కాంట్రాక్టు కార్మికులు ప్రశ్నిస్తే వారికి ఉద్యోగం నుంచి తొలగించి వేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. యూనియన్ నాయకుడు కూడా సరిగా పట్టించుకోవడం లేదనే కార్మికులు చర్చించుకుంటున్నారు. ఇటీవల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరిన కార్మికులను పనిలో నుంచి తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ అ
ధికార్లు, యూనియన్ నాయకులు చెప్పినట్లు నడుచుకోవాలి. లేదంటే ఉద్యోగం ఊడినట్లే. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు అవస్థలు వర్ణతీతంగా ఉంది. కమిషనర్ దినిస్పందించి చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
- కందారపుమురళి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు తిరుపతి జిల్లాలో ఉన్న మున్సిపల్, పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వేతనలు పెంచకపోగా వారిచేత వెట్టిచాకిరి చేయించడం దారుణం. పారిశుధ్యకార్మికులకు అన్ని వసతులు కల్పించాలి. కార్మికుల సమస్యలు పరిష్కరం కోసం ఈనెల 25న విజవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.










