Apr 10,2023 00:00

సమావేశంలో మాట్లాడుతున్న చాంద్‌బాషా

ప్రజాశక్తి-గుంటూరు : మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖలో ఫ్యామిలీ వెల్ఫేర్‌ హెడ్‌ ఆఫ్‌ ఎకౌంట్‌, 2211 పద్దు క్రింద పనిచేసే ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నేటి వరకూ జీతాలు జమ కాలేదని, ప్రతినెలా జీతాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సయ్యద్‌ చాంద్‌బాషా అన్నారు. ఆదివారం ఎపిజిఇఎ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక నగరంపాలెంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించారు. చాంద్‌బాషా మాట్లాడుతూ సాంకేతిక లోపాలను సరిచేసి జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి శివారెడ్డి, ఉపాధ్యక్షులు మహేష్‌బాబు, హుస్సేన్‌ ఖాన్‌, జి.శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు నాగేశ్వ రరావు, రాధాకృష్ణ, హరికృష్ణ పాల్గొన్నారు.