Jun 19,2023 01:07

మాట్లాడుతున్న లకీëనారాయణ

ప్రజాశక్తి - మేడికొండూరు : నిక్‌ ఆగ్రో ఆయిల్‌ కంపెనీ వర్కర్స్‌ జీతాలు పెంచకుంటే సమ్మె తప్పదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ అన్నారు. ఆదివారం పేరేచర్ల సెంటర్‌లో కె.సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన కంపెనీ వర్కర్స్‌ యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. నేతాజి మాట్లాడుతూ కార్మికుల జీతాలు పెంచాలని సమ్మె నోటీసు ఇస్తే సమస్యలు పరిష్కరించకుండా, యూనియన్‌తో చర్చించకుండా మొండివైఖరి ప్రదర్శించడం సరికాదన్నారు. సమస్యలు పరిష్కారం కోసం చర్చలు జరగ కపోతే ఈనెల 26వ తారీకు తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అప్పటి వరకూ దశలవారీ ఆందోళనపై పలు నిర్ణయాలు చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారా యణ, నాయకులు బి.రామకృష్ణ, బి.లక్ష్మణరావు, ఎస్‌ఎం బాషా, వెంకటేష్‌, శ్రీకాంత్‌, మీర్సా, ఖాసిం, గోపి పాల్గొన్నారు.