Sep 05,2023 00:19

ప్రజాశక్తి - అద్దంకి
ఉపాద్యాయుల జీతాలు ఇవ్వకుండా గురుపూజోత్సవం జరుపుకునే అర్హత సిఎం జగన్మోహన్‌రెడ్డికి ఎక్కడిదని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌ ప్రశ్నించారు. టిడిపి నేతలతో ఆయన సోమవారం మాట్లాడారు. రాష్ట్రంలో జగన్‌ ప్రజావ్యతిరేక పాలనతో అన్నీ రంగాలు విఫలమయ్యాయని అన్నారు. ఉద్యోగులను ఉద్దరిస్తానని అధికారంలోకి వచ్చాక 5వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం అన్నారు. నెల నెలా జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కే పరిస్థితి జగన్‌ తీసుకొచ్చాడని అన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులు అందరి పరిస్థితి ఇలాగే ఉందన్నారు. కరోనా సమయంలో మద్యం షాపుల వద్ద ఉపాధ్యాయులను నిలబెట్టి, నాడు నేడు పనుల కోసం కరోనా సమయంలో పాఠశాలలు నడిపి అనేక మంది ఉపాధ్యాయుల మరణానికి జగనే కారణమని అన్నారు. బదిలీలైన 30వేల మంది ఉపాధ్యాయులకు 3నెలలు నుండి జీతాలు చెల్లించ లేదని అన్నారు.