ప్రజాశక్తి-బాపట్ల రూరల్: సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని అమరావతి ప్రభుత్వ ఉద్యోగుల జేఏసి చైర్మన్ సురేష్‌బాబు అన్నారు. గురువారం ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బాపట్లలోని ప్రధాన బ్యాంకులు ఎస్‌బిఐ మెయిన్ బ్యాంక్‌ను సందర్శించి బ్యాంక్ మేనేజర్లకు వినతిపత్రం అందించారు. బ్యాంకు రుణాలు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నెల నెల ఈఎంఐల విషయంలో ఒత్తడి పెట్టవద్దని, పెనాల్టీలు వేయవద్దని వారు ప్రధాన బ్యాంక్ మేనేజర్లను కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఉపాధ్యక్షులు ఎ సుమంత్ రాజ్, రెవెన్యూ సంఘ కోశాధికారి బి ఓంకార్, ప్రచార కార్యదర్శి డి అర్జున్, జిల్లా నాయకులు పెరుగు శ్రీనివాసరావు, జాసన్, సిటీ యూనిట్ ఛైర్మన్ సహాయ కార్యదర్శి జాసన్, ఉద్యోగులు పాల్గొన్నారు.










