యుటిఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు విజయకుమార్‌ప్రజాశక్తి - బద్వేలు
ఉపాధ్యాయులకు జీతాలి వ్వకుండా వేధిస్తూ, మరోపక్క ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయులకు సన్మానాలు చేయడమేంటని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదన విజయ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం బద్వేలులోని స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బదిలీ, ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయులకు మూడు మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని విమర్శించారు. క్యాడర్ స్ట్రెంత్ అప్డేషన్ పేరుతో మూడు నెలల నుంచి ఉపాధ్యాయులకు జీతాలు
చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయులను ఏదో ఒక రకంగా వేధించడం రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. మూడు మాసాలుగా జీతాలు చెల్లించకపోతే ఉపాధ్యాయులు ఎలా జీవించాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఇంటి అద్దె, బ్యాంకు వ్యక్తిగత, గహ రుణాల కంతులు చెల్లించలేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల బ్యాంకు రుణాల కంతులు చెల్లించలేక డీఫాల్టర్స్‌గా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీ, ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయులకు జీతాలివ్వాలని ఆందోళన చేస్తుంటే స్పందించకపోవడం దారుణమని వాపోయారు. ఉపాధ్యాయులందరికీ జీతాలు చెల్లించకపోవడం కక్ష సాధింపులో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. జీతాల చెల్లింపు వ్యవహారంలో విద్యాశాఖ వారు, ఖజానా శాఖ వారు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ని సమస్యల నడుమ జీతాలు లేకుండా ఇబ్బంది పడుతూ రేపటి గురుపూజోత్సవాన్ని ఉపాధ్యాయులు సంతోషంగా ఎలా జరుపుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తన వైఖరిని విడనాడి ఉపాధ్యాయులకు తక్షణం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు యస్.శశిధర్ కుమార్, గోపవరం మండల అధ్యక్షుడు వీరదాసరి క్రిస్టఫర్ పాల్గొన్నారు.జీతాలివ్వకుండా..
చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయులను ఏదో ఒక రకంగా వేధించడం రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. మూడు మాసాలుగా జీతాలు చెల్లించకపోతే ఉపాధ్యాయులు ఎలా జీవించాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఇంటి అద్దె, బ్యాంకు వ్యక్తిగత, గహ రుణాల కంతులు చెల్లించలేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల బ్యాంకు రుణాల కంతులు చెల్లించలేక డీఫా ల్టర్స్‌గా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీ, ఉద్యో గోన్నతి పొందిన ఉపాధ్యాయులకు జీతాలివ్వాలని ఆందోళన చేస్తుంటే స్పందించకపోవడం దారుణమని వాపో యారు. ఉపా ధ్యాయులందరికీ జీతాలు చెల్లించకపోవడం కక్ష సాధింపులో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభు త్వానికి చిత్తశుద్ధి ఉంటే తన వైఖరిని విడనాడి ఉపాధ్యా యులకు తక్షణం జీతాలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు యస్. శశిధర్ కుమార్, గోపవరం మండల అధ్యక్షుడు వీరదాసరి క్రిస్టఫర్ పాల్గొన్నారు.










