రాయచోటి : బదిలీలు, ప్రమోషన్లు పొందిన, అప్ గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలకు డిడిఒ కేటాయించని కారణంగా ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు ప్రక్రియలో విద్యా శాఖ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరి ప్రసాద్, షేక్ జాబీర్ తెలిపారు. శుక్రవారం డిఇఒ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా శాఖ స్వయంగా బదిలీ లేదా ప్రమోషన్ష్ పొందిన ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు కొరకు వారి వివరాలు కావాలంటూ విద్యా శాఖ అధికారులను అడగడమంటే విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు మచ్చు తునకని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంతోటే అడ్మిషన్లు, జగనన్న విద్యా కానుక పంపిణీ, నాడు నేడు పనులు వంటివి ఉన్నాయన్నారు. కొన్ని చోట్ల ప్రాథమికోన్నత పాఠశాలలు సైతం ఏకోపాధ్యాయుడుతో నడుస్తుండడం, అక్రమ బదిలీలు, వెంట వెంటనే జరిగే పని సర్దుబాట్లతో ఎవరి పోస్ట్ ఎప్పుడు ఉడుతుందో అని మానసిక ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. పనిచేసిన కాలానికి జీతాలు తీసుకోలేని పరిస్థితిని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కల్పించడంతో ఉపాధ్యాయ లోకం తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో వారి పిల్లల చదువు, పెళ్లిళ్ల కోసం తీసుకున్న బ్యాంకు లోన్లు, హోమ్ లోన్ల నెలవారి వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీలపై వడ్డీలే కాకుండా వారి బ్యాంకు సిబిల్ రేటు క్షీణించి భవిష్యత్తులో బ్యాంకులు కూడా అప్పు ఇవ్వని స్థాయికి వారి ఆర్థిక పరిస్థితి దిగజారితోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించుటకు తగిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఈ ఉద్యమా మండలాల్లో దానికి న్ని మరింత ఉధ తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శిలు భాస్కర్‌రెడ్డి, దావుద్దీన్, రమణమూర్తి, శ్రీధర్‌రెడ్డి ,సురేంద్ర రెడ్డి,మండలాల నాయకులు రాజారమేష్, అల్లూరు మస్తాన్, శంకర్, ప్రసాద్, హఫీజుల్లా, శ్యాంసుందర్, రఫీ, ఇమ్రాన్, రియాజ్, రియాజ్, వెంకటరమణ, ఫయాజ్ చాంద్ భాషా, జగదీష్, రాజబాబు అంజాద్‌బాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










