ఫొటో : వాల్‌పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు
జీపు జాతాను విజయవంతానికి పిలుపు
ప్రజాశక్తి ఆత్మకూరు అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఆధ్వర్యంలో జరుగుతున్న జీపు జాతా విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు హర్ష అన్నారు. శుక్రవారం పట్టణంలో చెర్లో రమణారెడ్డి భవన్‌లో (సిపిఎం) కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని విద్యారంగా నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జీపుజాతా జరుగుతుందని విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా ఈ జీపు జాతాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాలాజీ, అశోక్, ఖాదర్, పాల్గొన్నారు.










