ప్రజాశక్తి-అరకులోయ రూరల్:పాడేరు ఏజెన్సీ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల, పాఠశాలలోని నెలకొన్న మౌలిక సమస్యల పై యుటిఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా ఈ నెల 17నుండి 22 వరకు జరిగే జీపు జాత జయప్రదం చేయాలని యుటిఏఫ్ రాష్ట్ర కార్యదర్శి వి మహేష్ కోరారు. అరకులోయ గిరిజన సంఘం కార్యాలయంలో శనివారం జీపు జాతా గోడ పత్రిక విడుదల చేశారు. జీపుజాతాలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు పాల్గొననునట్లు తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు టి.చిట్టిబాబు, జిల్లా కార్యదర్శి కె.రఘునాథ్, ఐటిడిఎ సబ్ కమిటీ కో కన్వీనర్ యం.బాబురావు, మండల నాయకులు ఎల్.బి చంద్రశేఖర్‌రావు, యస్.రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










