Sep 26,2023 21:33

విలేకరుల సమావేశంలో చింతామోహన్‌ సూటిప్రశ్న

జీఎస్‌టిపై బహిరంగ
చర్చకు సిద్ధమా : కాంగ్రెస్‌
తిరుపతి(మంగళం): ఇటీవల నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో బహిరంగ సభలో మాట్లాడుతూ అవినీతి గురించి ప్రస్తావించారని, దేశంలో మునుపెన్నడూ లేని విధంగా జీఎస్టీ విధానంలోనే విపరీతమైన అవినీతి జరుగుతోందని కేంద్ర మాజీ ఎంపీ చింతామోహన్‌ ఆరోపించారు. మంగళవారం తిరుపతి నగర పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం ఒకే ఎలక్షన్‌ అనే బిజెపి పార్టీ ఒకే పన్ను విధానం ఎందుకు తీసుకురారు అని ప్రశ్నించారు. 3 వేల వస్తువులకు ఐదు స్లాబుల ద్వారా పన్నులను వసూలు చేస్తూ నెలకు 1.5 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి వసూలు చేస్తూ ఉందన్నారు. నిత్యవసర ధరలు అదుపు చేయలేని కేంద్ర ప్రభుత్వం పేదవాడు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్‌ బెడ్‌ పై ఉన్నా కూడా జీఎస్టీ విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే ఎలక్షన్‌ అనే బిజెపి పార్టీ 5, 8, 12, 15, 20, 28 శాతాలుగా పన్నుల వసూళ్లను చేయాలని ఏ ప్రతిపాదికన నిర్ణయించారో చెప్పాలన్నారు.
విలేకరుల సమావేశంలో చింతామోహన్‌ సూటిప్రశ్న