ప్రజాశక్తి-వేటపాలెం: ఎస్‌సిఎస్‌పి జీడిమామిడి పరిశోధన సంచాలయం పుత్తూరు, కర్ణాటక వారి ఆధ్వర్యంలో అఖిల భారత సమన్వయ జీడిమామిడి పరి శోధన పథకం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి పి జెన్నెమ్మ తెలిపారు. మంగళ వారం వేటపాలెం మండల పరిషత్ ప్రాంగణంలోని ఐసిడిఎస్ సమావేశ హాలులో జీడిమామిడి, మామిడి సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండల వ్యవసాయ సలహామండలి చైర్మన్ పల్లప్రోలు శ్రీనివాస రావు మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై మామిడి, జీడిమామిడి మొక్కలను అందిస్తే ఎంతో ఉపయోగక రంగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. జీడిమామిడి సాగులో వచ్చే పురుగులు, చీడ పీడల గురించి, వాటి నివారణ గురించి డాక్టర్ నరేంద్ర రెడ్డి రైతులకు వివరించారు. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, ప్రాజెక్టు డైరెక్టర్ బివి రమణ, ఏపీ సీఎన్‌ఎఫ్ భారతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతులు, విఏఏ, విహెచ్‌ఏ, ఏఈఓ, ఏపీసిఎన్‌ఎఫ్, ఎంఐపి స్టాఫ్ పాల్గొన్నారు.










