Aug 06,2023 23:15

చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్‌

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌: సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్మాణంలో నష్టపోయిన జీడి మొక్కలకు నష్టపరిహారం చెక్కులను వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూలపేట పోర్టుతో బాధితులకు ఎటువంటి నష్టం లేకుండా నష్టపరిహారం అందజేస్తామని హామీనిచ్చారు. ఈ పోర్టుతో ఈ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్యక్రమంలో సంతబొమ్మాళి జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి, విశ్వసముద్రం కంపెనీ జనరల్‌ మేనేజర్‌ శంకర్‌, మూలపేట ఉప సర్పంచ్‌ జీరు రాంబాబు, కోట దాలయ్య, జీరు శివారెడ్డి, జీరు రోనంకిరెడ్డి, దారపు అప్పలరెడ్డి, జీరు శేఖర్‌ పాల్గొన్నారు.
చదరంగం పోటీల బ్రోచర్‌ ఆవిష్కరణ
ఈనెల 10 నుంచి 12 వరకు శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన భవన్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి అండర్‌-11 చదరంగం పోటీల బ్రోచర్‌ను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో చెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సనపల భీమారావు, చెస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి జామి రమేష్‌,. వైసిపి నాయకులు చింతాడ మంజు, చింతాడ గణపతి పాల్గొన్నారు.