Mar 05,2023 23:20

జీడి, మామిడి తోటల్లో మంటలు

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని కాగిత గ్రామ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు జీడి, మామిడి తోటల్లో మంటలు వ్యాపించడంతో తీవ్ర నష్టం జరిగిందని సంబంధిత రైతులు ఆవేదన వెలిబుచ్చారు. జీడి, మామిడి తోటల్లో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి రైతులు సమాచారాన్ని ఇవ్వడంతో వారు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, రైతులు మంటలను అదుపు చేశారు.సుమారుగా 6 ఎకరాల్లో తోటలు కాలి పోయాయని, ప్రస్తుతం తోటలు పూత, పిందె దశలో ఉన్నాయన్నారు. టేకు చెట్లు కూడా దగ్ధం అయ్యాయని, లక్షల్లో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.