
వినతి పత్రం ఇస్తున్న అప్పలరాజు, రైతులు
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని ఎన్.నర్సాపురం గ్రామంలో తొమ్మిది మంది రైతులకు చెందిన జీడి మామిడి తోటలు దగ్ధమయ్యాయని, బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు కోరారు. సోమవారం డిప్యూటీ తహశీల్దార్ నీరజకు బాధిత రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, గ్రామానికి చెందిన రైతులకు చెందిన 4-50 ఎకరాల భూములో జీడి మామిడి తోటల్లో మంటలు చెలరేగి దగ్ధమయ్యా యన్నారు. వీరికి ఈ భూములు తప్ప వీరే ఆధారం లేదన్నారు. ఫలసాయం చేతికి అందివచ్చే సమయంలో అగ్నికి ఆహుతి కావడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.రాజేష్, రైతులు పాల్గొన్నారు.