Aug 30,2023 22:50

చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్‌

* సర్పంచ్‌కు అందని సమాచారం
ప్రజాశక్తి- నౌపడ: 
సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు భూసేకరణలో భాగంగా రైతులు ఆధీనంలో ఉన్న జీడి చెట్లకు నష్టపరిహారంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ బుధవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాల నుంచి 120 మంది రైతులకు రైతులకు ఒక్కో మొక్కకు రూ. 2,500 చొప్పున లెక్క కట్టి చెక్కులను అందజేశామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మొక్కకూ నష్టపరిహారం చెల్లించిందని అన్నారు. కొన్ని సాంకేతిక సమస్యలు, కుటుంబ సభ్యుల అభ్యంతరాలపై మరో పది మంది వరకు చెక్కులు పంపిణీ ఆలస్యం అవుతుందని తెలిపారు. ఉద్యానవన, రెవెన్యూ అధికారుల గతంలో సర్వే చేసినా పోర్టు సిబ్బంది పలుమార్లు పరిశీలించి నష్టపరిహారం అర్హుల జాబితాను తయారు చేసినట్టు తెలిపారు. గ్రామంలో నష్టపరిహార చెక్కులు పంపిణీ కార్యక్రమానికి సర్పంచ్‌ జీరు బాబూరావుకు అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో గైర్హాజరయ్యారు. తనకు సమాచారం ఇవ్వకపోవడంపై శ్రీనివాస్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.