Sep 12,2023 21:41

ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ-2 తోట శ్రీనివాసులు

జిఇఆర్‌ సర్వే నాణ్యతగా ఉండాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలో జరిగే జిఇఆర్‌ సర్వే నాణ్యత నిజాయితీగా ఉండాలని ఎంఇఒ-2 తోట శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో మండల అభివృద్ధి అధికారిణి దేవరకొండ ఈశ్వరమ్మ అధ్యక్షతన సచివాలయ వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లకు సిఆర్‌ఎంటి క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్‌లతో గ్రాస్‌ ఎన్‌ ర్లోల్‌ మెంట్‌ రేషియో సర్వేపై జిఇఆర్‌ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో సర్వే నాణ్యతగా చేయాలని వలంటీర్లు సచివాలయ వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు వారికి కేటాయించిన గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఖచ్చితమైన సమాచారం నమోదు చేయవలెనని సూచించారు. ఐదు సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు లోపల ఉన్న వారు ఎవరు కూడా బడి బయట ఉండకుండా వారిని రెగ్యులర్‌ పాఠశాలల్లో లేదా ఓపెన్‌ స్కూల్లో నమోదు చేయించాలని తెలియజేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులను ప్రభుత్వ హై స్కూల్స్‌లో చెర్పించి వారు పరీక్షలకు హాజరయ్యే విధంగా చూడాలని తెలియజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.