జిఎంకు పుష్పగుచ్ఛమిస్తున్న సిఐటియు నేత ప్రకాష్
ప్రజాశక్తి -గాజువాక :భెెల్ హెచ్‌పివిపి యూనిట్ జనరల్ మేనేజర్‌గా ఉద్యోగోన్నతిపై వచ్చి శనివారం బాధ్యతలు స్వీకరించిన జితేందర్‌రెడ్డిని బెల్ సిఐటియు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, కార్మికుల తరపున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యూనిట్‌లోని కార్మికుల సమస్యలు, పని పరిస్థితులపై చర్చించడానికి సమయం కేటాయించాలని జిఎం జితేందర్‌రెడ్డిని సిఐటియు నేతలు కోరగా,ఆయన స్పందిస్తూ, వచ్చే వారంలో చర్చిద్దామన్నారు. కొత్త జిఎం జితేందర్‌రెడ్డిని కలిసిన వారిలో భెల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జి టి పి ప్రకాష్, కె. విజరు కుమార్ , జి చిన్న బాబు ఉన్నారు.










