
ఉండి:రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు విమర్శించారు. ఎన్‌ఆర్ పి.అగ్రహారంలో బుధవారం ఎంఎల్‌ఎ మంతెన రామరాజు ఆధ్వర్యంలో ఇంటింటికీ బాబు, బాబుతో నేను, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడారు. పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పాతాళంలోకి తొక్కేశారన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, దూసనపూడి రాంబాబు, కిన్నెర వెంకన్న, బురిడి రవిబాబు పాల్గొన్నారు.
మొగల్తూరు : చంద్రబాబు నాయుడుతోనే అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరుగుతుందని టిడిపి మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు అన్నారు. మొగల్తూరులోని పితాని వారి పాలెంలో బుధవారం సాయంత్రం బాబుతో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కత్తిమండ ముత్యాలరావు, బల్ల శ్రీను, బస్వాని ఏడుకొండలు పాల్గొన్నారు.