Nov 10,2023 20:51

నందవరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి

ప్రజాశక్తి - నందవరం
రాబోయే కాలంలో కూడా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా జగనే కావాలని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తెలిపారు. శుక్రవారం నందవరం సచివాలయం-2లో 'ఎపికి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా, కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీల తేడా లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించినట్లు తెలిపారు. వైసిపి సీనియర్‌ నాయకులు శివారెడ్డి గౌడ్‌, లక్ష్మీకాంతరెడ్డి, విరుపాక్షి రెడ్డి, పేట శ్రీనివాస్‌ రెడ్డి, సర్పంచి తోట సావిత్రి, ఎంపిడిఒ దశరథ రామయ్య, వైసిపి నాయకులు వెంకటేశ్వర్‌ రెడ్డి, చాంద్‌ బాషా, జడ్‌పిటిసి నిఖిల్‌ చక్రవర్తి, ఇఒఆర్‌డి ఈశ్వరయ్య స్వామి పాల్గొన్నారు. కోసిగిలోని 1వ సచివాలయంలో 'ఎపికి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. మధ్యాహ్నం సచివాలయం-2లో 'సంక్షేమ పథకాల బోర్డు'ను ఆవిష్కరించారు. అనంతరం వైసిపి జెండాను మండల జెసిఎస్‌ ఇన్‌ఛార్జీ పి.మురళీమోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. సర్పంచి అయ్యమ్మ, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు నాడిగేని నరసింహులు, మహాంతేష్‌ స్వామి, ఎన్‌.నాగరాజు, బసిరెడ్డి, హోళగుంద కోసిగయ్య, ఉస్మాన్‌, బుళ్లి నరసింహులు, పి.నాగేష్‌, ప్రవీణ్‌ కుమార్‌, సోఫీ, కాంట్రాక్టర్‌ నాగరాజు పాల్గొన్నారు. హాలహర్వి మండలంలోని బాపురం సచివాలయంలో వైసిపి మండల కన్వీనర్‌ భీమప్ప చౌదరి అధ్వర్యంలో 'ఎపికి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. మండల జెసిఎస్‌ కన్వీనర్‌ రంజిత్‌ కుమార్‌, సర్పంచి నాగేంద్ర పాల్గొన్నారు.

కోసిగిలో మాట్లాడుతున్న నాయకులు
కోసిగిలో మాట్లాడుతున్న నాయకులు