ప్రజాశక్తి-పీలేరు: రోగుల దగ్గరకే ప్రభుత్వం మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు పీలేరు సర్పంచ్ జీనత్ షఫి తెలిపారు. బుధవారం స్థానిక మోడల్ కాలనీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య నిపుణులతో చికిత్సలు, సలహాలు, సూచనలు అందిస్తూ వారికి మందులు, మాత్రలు ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే రోగి స్థితిని బట్టి మెరుగైన చికిత్స కోసం ఉన్నత స్థాయి ఆసుపత్రులకు పంపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి మురళీమోహన్ రెడ్డి, మండల తహశీల్దార్ ధనుంజయులు శిబిరాన్ని తనిఖి చేసి సూచనలు, సలహాలిచ్చారు. వైద్యనిపుణులు డాక్టర్ శివయ్య, డాక్టర్ కార్తీక్ కుమార్, డాక్టర్ చంద్రశేఖర్ నాయక్, డాక్దర్ దీప పాల్గొని రోగులకు చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలుపుల పిహెచ్ సి పారమెడికల్ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ అధికారులు, సచివాల అధికారులు, వాలంతీర్లు పాల్గొన్నారు.