- ఎంపిడిఓ జాన్ లింకన్.
ప్రజాశక్తి - ఆలమూరు : రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంపిడిఓ కె.జాన్ లింకన్, సర్పంచ్ తోట భవాని, ఎంపిటిసి తోలేటి సంతోషి అన్నారు. మండలంలోని సందిపూడిలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వారి అధ్వర్యంలో నిర్వహించారు. కిమ్స్ ప్రత్యేక వైద్య నిపుణులు ఈ.మౌలి, పి.ప్రసన్నలక్ష్మిలతో పాటు స్థానిక వైద్యాధికారులు పి.భవాని శంకర్, డి.సువర్చాల, నేత్ర వైద్య నిపుణురాలు పి.శ్రీలక్ష్మి పాల్గొని 350 మంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి 105 రకాల మందులను ఉచితంగా అందజేశారు. అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ టి.ఎన్.వి.నాగలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీలు విజయలక్ష్మి, అనంతలక్ష్మి, లక్ష్మిలు తయారుచేసిన 35 రకాల పౌష్టికాహారం వంటకాలను గ్రామ నాయకులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ పి.రాధాకృష్ణ, హెల్త్ ఎడ్యుకేటర్ ఏవి రాజాఅక్కుల సూపర్వైజర్, ఎం శ్రీనివాసరావు, నాగలక్ష్మి, హెల్త్ విజిటర్ పి.ఉమా, హెల్త్ అసిస్టెంట్ నాగేశ్వరావు, ఫార్మసిస్ట్ డి.సుగుణ లక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ పి.రాజా రమేష్ , అరోగ్య శ్రీ నోడల్ అధికారి నామాల రామకృష్ణ విఆర్ఓ సత్యనారాయణ, వైఎస్ఆర్సిపి నేతలు మోటుపల్లి వెంకన్న, తోరాటి గోవిందు, సిద్దిరెడ్డి శివ, తదితరులు పాల్గొన్నారు.










