ప్రజాశక్తి-రామచంద్రపురం : గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకమే జగనన్న సురక్ష అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.ఆయనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం లోని తాళ్లపాలెం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగారూపొందించిన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతి పేదవానికి ఆరోగ్య రక్షగాఉపయోగపడుతుందని వివరించారు. గ్రామంలోఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలనిఆయనసూచించారు.ఆరోగ్య సమస్యలు వారు స్పెషలిస్ట్ డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకుని వారి సూచనల ప్రకారం మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉండాలని మంత్రి తెలియజేశారు రాష్ట్రంలో ప్రతివానికి మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని రూపొందించి ఇంటికి వైద్యులు వెళ్లి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని తగిన సూచనలు ఇస్తూ వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెరుగైన చికిత్సలు వైద్యం అందిస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు గ్రామ సర్పంచ్ , ఉన్నతాధికారులు గ్రామ సచివాలయం సిబ్బంది వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










