
- ఎంపీపీ మోపిదేవి వెంకట హరనాథ్ బాబు, జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య నిజాంపట్నం.
ప్రజాశక్తి-బాపట్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష బావాజీపాలెం గ్రామం వైద్య శిబిరం నందు ఎంపీపీ మోపిదేవి వెంకట హరనాథ్ బాబు, జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య, మండల ప్రత్యేక అధికారి మత్స్యశాఖ జేడీ సురేష్,తహసీల్దార్ కె. నెహ్రూ బాబు పాల్గొన్నారు.ఈ పధకం పేదలకు గొప్ప వరం అని పంచాయతీ ప్రజలు సద్వినియోగం చేసుకోవలసినదిగా తెలియజేశారు.నిరుపేదలకు ఉచితంగా సేవలు అందించాలనే సంకల్పం తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి పల్లె లో ఏర్పాటు చేస్తున్నారన్నారు.సాధారణ జబ్బు లతో పాటు బీపీ, షుగర్,గుండె, కంటికి, వివిధ అన్ని రకాల జబ్బులు సంబందిత రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, వైద్య నిపుణులచే మందులు అందజేస్తున్నారన్నారు.అవసరమైతే ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేసి అక్కడ మెరుగైన వైద్య సేవలు అందజేస్తారన్నారు.దీర్ఘకాలంగా అనారోగ్యానికి గురైన వ్యక్తులతో పాటు,ఇంటికే పరిమితమైన వృద్దులకు డాక్టర్లు ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న తీరుపై ప్రజలు నుండి హర్షాతిరేకాలు వెల్లువెత్తు తున్నాయని తెలిపారు. కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవలసినదిగా తెలియజేశారు.ప్రజలు హెల్త్ క్యాంపుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రాంగణం కిటకిట లాడింది.కార్యక్రమం లో ప్రత్యేక వైద్య నిపుణులు బృందం, వైద్య సిబ్బంది,అధికారులు,వైస్ ఎంపీపీ సుబ్బారావు, ఎంపీటీసీ నాజర్ ఖాన్,గ్రామ సర్పంచ్ షేక్ నజీర్ అహమ్మద్, విఆర్వో జ్యోతి, సచివాలయసిబ్బంది తదితరులు పాల్గొన్నారు