
ప్రజాశక్తి-కలకడ(అన్నమయ్య): జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదల పాలిట వరము లాంటిదని ఎంపీపీ శ్రీదేవి రవికుమార్ కొనియాడారు.శుక్రవారం మండలంలోని కోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఈ జగనన్న ఆరోగ్య సురక్ష పేదల పాలిట ఒక వరమని ఆరోగ్యం గురించి తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి పేదలందరూ ఆరోగ్యంగా ఉండాలని పేదలకు దగ్గరలో, చేరువలో మెరుగైన వైద్యం అందాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అని, ఏ ఎన్ ఎం, ఎల్ హెచ్ పి ఆశా వర్కర్, వాలంటీర్ ద్వారా సర్వే నిర్వహించి టోకెన్ నెంబర్ జారీచేసి అవసరమైన వైద్య పరీక్షల అవసరమైన రోగులని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుకు రమ్మని టోకెన్ జారీ చేయడం జరిగింది అని, అదేవిధంగా ఎవరికైతే వైద్య పరీక్షలు అవసరం ఉన్నాయో వారందరూ కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో హిమోగ్లోబిన్, బీపీ పరీక్ష, యూరిన్ పరీక్షలు, మలేరియా, డెంగ్యూ పరీక్షలు, చేసుకోవచ్చని రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని, అలాగే ఇంకా మెరుగైన వైద్యం కోసం అవసరాలను బట్టి ఆరోగ్యశ్రీ కింద పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో మునిపెన్నడూ ఎవరూ చేయలేని ఆలోచన ఎంతో దూర దృష్టితో మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేశారని,ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఈ జగనన్న ఆరోగ్య సురక్షకు మంచి స్పందన కలుగుతుందని, పేదలందరి మందనలు మన్ననలు మన ముఖ్యమంత్రి పొందుతున్నారని, జగనన్న ఆరోగ్య సురక్ష ను ప్రతి ఒక్కరూ సద్వినియోపరుచుకోవాలని కోరారు .