
ప్రజాశక్తి-చల్లపల్లి : పేదలు ఒక్క మందు బిళ్ళ కూడా బయటకొనే అవసరం లేకుండా ప్రభుత్వ వైద్య రంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బులోపేతం చేశారని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య సేవలను సీఎం జగన్ అభివృద్ధి చేశారన్నారు. ఇంత బాధ్యతగా సేవ చేస్తున్న జగన్మోహనరెడ్డిని మరోసారి గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లూరు కోటేశ్వరరావు, పిఎస్ ఎస్ చైర్ పర్సన్ నాని, ఎంపీటీసీ సభ్యులు మోపిదేవి ద్వారకనాథ్ శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, అంగన్వాడి ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు