ప్రజాశక్తి- దేవనకొండ
రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరామ్ సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి, శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సొసైటీ ఫంక్షన్ హాలులో 'రాష్ట్రానికి సిఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలి' అనే అంశంపై సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులకు, వాలంటీర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 9 నుంచి సచివాలయాల్లో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి ఇంటికీ వెళ్లేలా సమాయత్తం కావాలని తెలిపారు. వైసిపి మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాకర్ల శాంతి కుమార్, ఎంపిపి భర్త లుముంబా, జెసిఎస్ కన్వీనర్ రాజారెడ్డి, వైసిపి మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి, నారాయణరెడ్డి, రాఘవేంద్ర, చాప ఈరన్న, కందనాతి రంగన్న పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న గుమ్మనూరు సోదరులు










