Oct 19,2023 21:49

ప్రజాశక్తి - కాళ్ల
             పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సిఎం జగన్‌ను మరోసారి సిఎంగా గెలిపించాలని డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. మండలంలోని ఏలూరుపాడు సచివాలయ-1 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పివిఎల్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచి భూపతిరాజు జగ్గరాజు, ఎంపిటిసి సభ్యులు చిన్నాపరపు రాంబాబు, గ్రామ అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
వీరవాసరం : ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఏడాది జనవరి నెల నుంచి పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచడానికి సిఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని మడుగు పోలవరం పంచాయతీ జొన్నలపాలెంలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు, తహశీల్దార్‌ ఎం.సుందర్‌రాజు, ఎంపిడిఒ జ్యోతి, పంచాయతీరాజ్‌ డిఇ స్వామినాయుడు, సర్పంచి బోణం పరమేశ్వరరావు, మానుకొండ ప్రదీప్‌ పాల్గొన్నారు.