
జగనన్నను మరోసారి ఆశీర్వదించండి : ఎమ్మెల్యే
ప్రజాశక్తి - పగిడ్యాల
పేద ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ఓటు వేసి ఆశీర్వదించి ముఖ్యమంత్రి చెయ్యాలని నందికొట్కూర్ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ప్రజలను కోరారు. శనివారం మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో గత మూడు నెలల నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేయడం లేదని గ్రామంలోని ప్రజలు ఎమ్మెల్యేకు విన్నవించారు. రేషన్ షాపులో బియ్యం ఎందుకు సక్రమంగా సరఫరా చేయడం లేదని ఎమ్మెల్యే డీలర్లను ప్రశ్నించారు. గోదం వద్ద నుంచి బియ్యం చాలా తక్కువ వస్తున్నాయని అందువల్లనే బియ్యం సరఫరా చేయలేకపోతున్నామని తహశీల్దార్ కు విన్నవించిన పట్టించుకోవడంలేదని డీలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. డీలర్ ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోవడం లేదని తహశీల్దార్ భారతి పై మండిపడ్డారు. సమస్య రాకుండా పరిష్కరించాల్సింది పోయి బాధ్యత రైతంగా ఉంటే ఎలా అని మండిపడ్డారు. కనీసం ఉన్నత అధికారుల కైనా ఫిర్యాదు చేశారా అని ఎమ్మెల్యే తహశీల్దార్ ను ప్రశ్నించారు. తక్షణమే ఫోన్ ద్వారా జాయింట్ కలెక్టర్కు ఎమ్మెల్యే సమస్యను వివరించారు. బీసీ కాలనీ దేవుని మన్యం సమీపాన ఉన్న ఇండ్లకు నీతి కుళాయిలో విద్యుత్ స్తంభాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వేయించి విద్యుత్ స్తంభాలు వేయించి విద్యుత్తు సరఫరా చేయించాలని ఎమ్మెల్యేను కాలనీవాసులు కోరారు. ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ శివకుమార్ను పిలిచి తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు అదేవిధంగా విద్యుత్తు ఏఈ క్రాంతి కుమార్ ను పిలిచి విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు కేంద్రంలో ఉన్న పిల్లలను చదువు సామర్ధ్యాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రం 1లో విద్యార్థులకు అందించే భోజనాన్ని తిని రుచి చూశారు. సాంబర ఇది నీళ్ల చార సాంబార్ లా లేదు ఒట్టినీళ్ళతో చేశారని అది కూడా కారంగా ఉందని ఇంత కారం ఉంటే పిల్లలు ఎలా తింటారని అంగన్వాడీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పశువైద్యశాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంగిరెడ్డి గారి రమాదేవి, జడ్పిటిసి పుల్యాల దివ్య, ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి, మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి, సర్పంచ్ ఆంజనేయులు, మాజీ సర్పంచ్ మద్దిలేటి, ఎంపీడీవో వెంకటరమణ, ఎంఈఓ సుభాన్, నందికొట్కూరు రూరల్ సీఐ విజయభాస్కర్, ఎస్సైలు నాగార్జున, వెంకటసుబ్బయ్య, పి ఆర్ ఏ ఈ వెంకటేశ్వర్లు, ఏపీవో మద్దిలేటి, ఏపిఎం శ్రీనివాసులు, ఐసిడిఎస్ సూపర్వైజర్ శేషమ్మ, పంచాయతీ కార్యదర్శులు ఉపేంద్ర రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.