ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం పేదల పక్షపాతిగా నిలిచిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఆదివారం అనంతపురంలోని కెటిఆ ర్ ఫంక్షన్ హాల్‌లో 'ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న కుల, మత, పార్టీలు చూడకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తోందన్నారు. శింగనమల నియోజకవర్గం ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. టిడిపి హయాంలో నీళ్లు అడిగినందుకు తనపై, నాయకులపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. జగనన్న పాలనలో ఎవ్వరి మీద కేసులు పెట్టలేదన్నారు. కానీ నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నియోజక వర్గంలో సాగు,తాగు నీరుకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఎన్నో ఏళ్లుగా నెరవేరని శింగనమల చెరువును లోకలైజేషన్ చేయించామన్నారు. గతంలో టీడీపీ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదు కాబట్టే, ప్రజలకు వారిమీద నమ్మకం కోల్పోయి గద్దె దింపారన్నారు.2014- 19 మధ్య చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు నెరవేర్చలేదని, కానీ 2019 నుంచి సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ఈ హామీలు, నవరత్నాల వివరాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాల న్నారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గ్రామ, సచివాలయాల స్థాయిలో వైసిపి జెండా ఎగరవేసి పల్లె నిద్ర చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పిటిసి భాస్కర్, గువ్వల రాజశేఖర్‌రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రేకులకుంట సాకే రామకృష్ణ, బుక్కరాయసముద్రం సర్పంచి పార్వతి, పూల నారాయ ణస్వామి, చికెన్ నారాయణస్వామి, కాలవ వెంకటలక్ష్మి, దయ్యాల కుంటపల్లి శివారెడ్డి, ఎంపిటిసి చిన్నపరెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, గృహసారథులు, మండల కన్వీనర్లు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి










