ప్రజాశక్తి - కాకినాడ
రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ధైర్యాన్ని, కొండంత భరోసాను కల్పించే గొప్ప కార్యక్రమమని ఎంపి వంగా గీత అన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానందహాల్ నుంచి కాకినాడ ఎంపి గీత, జడ్‌పి ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, ప్రత్యేక అధికారి (ధాన్యం సేకరణ, జగనన్నకు చెబుదాం) ప్రద్యుమ్న పిఎస్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఇన్‌ఛార్జ్ జెసి ఆర్.మహేష్ కుమార్, ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జడ్‌పి సిఇఒ ఎన్‌వివి సత్యనారాయణ, ఇన్‌ఛార్జ్ డీఆర్‌వో, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి అధికారులతో కలిసి వర్చువల్‌గా హాజరయ్యారు. ముఖ ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఎంపి వంగా గీత, కలెక్టర్ కృతికా శుక్లాలు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథ కాలు, సేవలకు సంబంధించి ఎలాంటి సమస్య పరిష్కారానికైనా 1902 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఎస్‌ఎంఎస్ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్థితిని, వాటి పరిష్కారం గురించి తెలుసుకునే సౌకర్యం ఉంటుందని వివరించారు. మండల, డివిజన్, జిల్లాస్థాయి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ల (పీఎంయు)తో పాటు జిల్లాస్థాయిలో ప్రత్యేక ఆడిట్ బందం అర్జీల పరిష్కార నాణ్యతపై నిరంతరం పర్యవేక్షిస్తాయని కలెక్టర్ కృతికా శుక్లా వివరించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు సమష్టిగా, సమన్వ యంతో కృషిచేయాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా వచ్చే ప్రతి అర్జీని నాణ్యతతో పరిష్కరిం చాలని, ప్రభుత్వ సేవలకు సంబంధించి అయినా ప్రజలు 1902 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి చెప్పొచ్చని తెలిపారు .కార్యక్రమంలోవ్యవసాయ శాఖ జెడి విజరుకుమార్, డ్వామా,ఐసిడిఎస్ పీడీలు ఎ.వెంకటలక్ష్మి, కె.ప్రవీణ, అధికారులు పాల్గొన్నారు.










