Aug 07,2023 21:14

ఫిర్యాదులను స్వీకరిస్తున్న పిఒ విష్ణుచరణ్‌

పార్వతీపురం: స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సోమవారం ఫిర్యాదుదారులు పోటెత్తారు. పలు సామాజిక, వ్యక్తిగత సమస్యలపై 105 అర్జీలు వచ్చాయి. ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్‌ జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌, డిఆర్‌ఒ జె.వెంకటరావు వినతులను స్వీకరించారు. అనంతరం ప్రజాసమస్యలపై జిల్లా అదికారులు, మండల అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.