ప్రజాశక్తి- బాడంగి : జగనన్నకు చెప్పినా సమస్యలు పరిష్కారం కావు అనుకున్నారో ఏమో... తమ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అర్జీలు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి జిల్లా అధికారులకు ఎదురైంది. అర్జీదారులు రాకపోవడంతో చాలా సేపు అధికారులు ఎవరి సెల్ఫోన్లు వారు చూసుకుంటూ కాలయాపన చేయాల్సి వచ్చింది. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో బుధవారం 'జగనన్నకి చెబుదాం' కార్యక్ర మాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మయూర అశోక్, జెడ్పి సిఇఒ రాజకుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా అధికారులు అందరినీ మండ లానికి తీసుకొచ్చి నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనాలు రాకపోవడంతో మండల అధికారులపై జాయింట్ కలెక్టర్ మండిపడ్డారు. ఎవరినో ఒకరిని అర్జీలతో పంపించాలని పదే పదే సెక్రటరీలకి, మండల అధికారులు చెప్పడంతో అప్పటికప్పుడు 30మందితో అర్జీలు దగ్గరుండి ఇప్పించారు. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో ప్రచారం చేయడంలో లోపంతోనే అర్జీదారులు హాజరు కాలేదని అధికారులు సచివాలయ సిబ్బందిపై మండిపడ్డారు. వచ్చిన అర్జీలలో ఎక్కువగా తహశీల్దార్ ఆఫీస్ గురించే వచ్చాయని తహశీల్దార్ అజు రఫీ జూన్పై జెసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఎక్కువ అడంగల్ సమస్యలు, రీ సర్వే గురించి వున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆర్డిఒ సాయిశ్రీకి ఆదేశించారు. బాలయోగి గురుకుల పాఠశాలలో తాగునీటికి ఇబ్బందిగా ఉందని సిబ్బంది తెలిపారు. పూడివలస గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు అందండం లేదని వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిలో భోజనాలు పెట్టె వాళ్లకి కూడా బిల్లులు అందడం లేదని చెప్పారు. గతంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహ కులు కూడా బిల్లులు అందండం లేదని వినతి పత్రం అంది ంచారు. బాడంగిలో ఇంటంటి కుళాయిలు లేవని సర్పంచ్ రమేష్ అని చెప్పారు. తోటపల్లి కాలువ నుండి కోటిపల్లికి సాగు నీరు కావాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఇంత మంది జిల్లా అధికారులు మండలానికి వచ్చి ఉంటే మండల అధికారులు ప్రజలకు తెలియజేయ డంలో విఫలమయ్యారన్నారు. ఏదో మొక్కు బడిగా మాత్రమే అర్జీలు వచ్చాయని, పూర్తి సంతృప్తి లేదని అన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి సోమవారం జిల్లాలో నిర్వహించే స్పందనకు రాకుండా మండల స్థాయిలోనే పరిష్కరించడమే లక్ష్యమన్నారు. మండ లానికి వస్తే ప్రోగ్రాం విజయవంతం అవ్వలేదని ఇంచార్జి ఎంపిడిఒ సూర్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, డివిజన్, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.