
నిమ్మనపల్లి : జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులకు తక్షణ పరిష్కారం చూపించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో ఎంపిపి నరసింహులు, సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, మండల వైసిపి ఇన్‌ఛార్జి ఆర్‌ఐ రమ ణారెడ్డి అధ్యక్షతన జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఎంపిడిఒ శేషగిరిరావు నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను స్థానికంగానే పరిష్కరించటానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహించడం జరుగు తుంద న్నారు. ప్రజలు జిల్లాలోని నలుమూలల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకుకోర్చి జిల్లా స్థాయిలో జరిగే స్పందన కార్యక్రమానికి వస్తుంటారని అన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను గుర్తించి మండల స్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతలను అధికారులు నిర్లక్ష్యం వహించకుండా సాధ్యమైనంత వరకు అక్కడకక్కడే పరిష్కరించి ఫిర్యాదుదారుల్లో సంతప్తి స్థాయిని పెంచాలని పేర్కొన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి మొత్తం 249 వివిధ శాఖలకు సంబంధించిన వినతులను ప్రజలు అందించారు. ఇందులో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి రాగా, కొన్ని ఇళ్లు, పింఛన్లకు సంబంధించినవి వచ్చినట్లు ఎంపిడిఒ శేషగి రిరావు తెలిపారు. రెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన ఎస్.నాగమ్మ తనకు వద్ధాప్య పింఛను మంజూరు చేయాలని, అగ్రహారం గ్రామానికి చెందిన పి.శకుంతల తనకి వద్ధాప్య పింఛను మంజూరు చేయించాలని కోరినట్లు తెలిపారు. కొండ య్యగా రిపల్లి గ్రామానికి చెందిన కే.చిన్నప్ప తనకు గత రెండు నెలల క్రితం వద్ధాప్య పింఛను తొలగించారని తిరిగి పించను పునరుద ్ధరించాలని వినతులను సమర్పించినట్లు పేర్కొన్నారు. వెంగం వారిపల్లి గ్రామానికి చెందిన పి.వెంకట సుబ్బయ్య తనకు సదరం సర్టిఫికెట్ మంజూరు చేయించాలని అర్జీ ఇచ్చారన్నారు. కార్యక్ర మంలో జిల్లా అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపిటిసిలు , సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.