
ప్రజాశక్తి - చెరుకుపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కషి చేస్తున్నామని కలెక్టర్ పి రంజిత్ భాష అన్నారు. జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమాన్ని బుధవారం మండలంలో నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రజా వినతులు స్వీకరించారు. మొత్తం 66దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిని వెంటనే సాధ్యాల మేరకు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, ఆర్డిఓ హేల షారోన్, జిల్లా అధికారులు, ఎంపీపీ రత్నప్రసాద్, వైస్ ఎంపీపీ పైనం రంగారెడ్డి, డిఎల్పిఓ తాత శివశంకరరావు, ఇంచార్జ్ ఎంపిడిఓ నాగలక్ష్మి, తహశీల్దారు బి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు విజయబాబు, సురేష్, మురళి పాల్గొన్నారు.