Oct 30,2023 22:38

ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌
ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్నకు చెబుదాం అర్జీల పరిష్కారంలో మండల స్థాయి కోఆర్డినేషన్‌ కమిటీలు మరింత చొరవ తీసుకొని నాణ్యతతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓ లు మండల స్థాయి అధికారులతో జగనన్నకు చెబుదాం స్పందన, ఏపీ సేవా, మీసేవా, ఓ టి ఎఫ్‌ పేమెంట్స్‌ పెండింగ్‌, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన, సంక్షేమ వసతి గహాల తనిఖీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అర్జీలు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ కి వెళ్ల కుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. 31న జాతీయ ఐక్యతా దినం ను మండల స్థాయిలో నిర్వహించాలని, భారత ప్రథమ హౌం శాఖ మంత్రి సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్‌ 31న జాతీయ ఐక్యత దినోత్సవం ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓప్రభాకర్‌ రెడ్డి, హౌసింగ్‌, డిఆర్‌డిఎ, ద్వామా పీడీలు పద్మనాభం, తులసి, గంగాభవాని, రాధమ్మ పాల్గొన్నారు.