Nov 20,2023 21:58

అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు

నెల్లూరు :జగనన్నకు చెబుదాం- కార్యక్రమానికి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే అర్జీలను నిర్థిష్ట గడువు లోపు పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌, అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ తిక్కన ప్రాంగణంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌, డిఆర్‌ఒ లవన్న , జెడ్‌పి సిఇఒ చిరంజీవి లతో కలిసి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జెసి కూర్మనాథ్‌ మాట్లా డుతూ జగనన్నకు చెబుదాం.. కార్యక్రమంలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దష్టి సారించి నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించేలా కషి చేయాలన్నారు. ఒకసారి వచ్చిన అర్జీ మళ్లీ మళ్లీ రాకుండా సమస్యను సంతప్తికర స్థాయిలో పరిష్కారం చూపాలని సూచించారు. మెప్మా, హౌసింగ్‌, ఐసిడిఎస్‌ పిడిలు రవీంద్ర, నాగరాజు, హేన సుజన, జిల్లా బిసి వెల్ఫేర్‌ అధికారి వెంకటయ్య, జిల్లా రిజిస్ట్రార్‌ బాలాం జనేయులు, డిఎస్‌ఓ వెంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి ఉన్నారు.
ఎస్‌పి కార్యాలయంలో..
స్థానిక ఉమేష్‌ చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'స్పందన' కార్యక్రమంలో పలు ప్రాంతాలకు చెందిన 128 మంది బాధితుల నుంచి ఫిర్యాదలు అందాయని ఎస్‌పి డాక్టరు కె.తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం పోలీసు 'స్పందన' కార్యక్రమం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. స్పందనకు మహిళలు, వద్దులు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, దివ్యాంగుల నుంచి అందిన ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బందికి సూచించామన్నారు. స్పందన కార్యక్రమంలోనే కాకుండా బాధితులు ఫిర్యాదులు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో వారి సమస్యలను పోలీసు సిబ్బంది సహనంతో వ్యవహరించి బాధితుల సమస్యలను సానుకూలంగా వినిఅర్ధం చేసుకొని భద్రతా, భరోసా కల్పించి సమస్యను పరిష్కరించేందుకు పటిష్టమైన చర్యలు తీసు కోవాలన్నారు. అడిషినల్‌ ఎస్‌పి (అడ్మిన్‌), ఎస్‌సి,ఎస్‌టి సెల్‌ -2 డిఎస్‌పి, ట్రైనీ డిఎస్‌పి కుమారి హేమలత, ఎస్‌బి సిఐ, ఆర్‌ఐ, కంప్లైంట్‌ సెల్‌ సిబ్బంది పాల్గొన్నారు.