
ప్రజాశక్తి- కె.కోటపాడు
ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, లంకవానిపాలెం సర్పంచ్ వేచలపు దొరబాబు, మండల వాలంటీర్లు కన్వీనర్ ఏటుకూరి రాజేష్ పిలుపునిచ్చారు. మండలంలోని పిండ్రంగి, లంకవానిపాలెం గ్రామాల్లో గురువారం గృహ సారథులు, వాలంటీర్ల కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహ సారథులు ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించాలని సూచించారు. అందుకు కావాల్సిన ప్రసార సామాగ్రిని ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పిండ్రంగి సర్పంచి రామలక్ష్మి, ఎంపీటీసీ గోపి, వైసిపి నాయకులు వెంకటరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనకాపల్లి : మండలంలోని కోడూరు, సిహెచ్‌ఎన్ అగ్రహారం, రేబాక, శంకరం, గొలగం, అక్కిరెడ్డిపాలెం, మారేడుపూడి, గోపాలపురం గ్రామాల్లో గురువారం ఎంపీపీ గొర్లి సూరిబాబు ఆధ్వర్యంలో కన్వీనర్లు, గృహ సారథులతో సమవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల స్పందనను 8296082960 నెంబరుకు నేరుగా ఫోన్ చేసి తెలియ చెప్పాలన్నారు.
గొలుగొండ: మండలంలోని కొంగసింగి, కేడిపేట సచివాలయంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయ కన్వీనర్ కొరుప్రోలు పాణి శాంతారాం, నర్సీపట్నం మార్కెట్ చైర్మన్ చిటికెల భాస్కర్‌నాయుడు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత, గొలుగొండ మండల వైసిపి అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, నాయకులు బుల్లి ప్రసాద్, కొంగ సింగి మాజీ సర్పంచ్ సత్యనారాయణ, సత్యనారాయణ, పత్తి రమణ పాల్గొన్నారు.
గోపాలపట్నం : 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసిపి శ్రేణులను జీవీఎంసీ కో-ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు కోరారు. స్థానిక కుమారి కల్యాణ మండపంలో 91, 92 వార్డుల కన్వీనర్లు, ఆర్పీలు, వాలంటీర్లు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గేదెల మురళీకృష్ణ, గునిశెట్టి శ్రీనివాసరావు, గొర్రెల అప్పలస్వామినాయుడు పాల్గొన్నారు
కలెక్టరేట్ : 'జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమాలపై జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి జైల్ రోడ్డు జంక్షన్ వరకు ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నాయకత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, స్టేట్ రెల్లి కుల కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదనరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ద్రోణంరాజు శ్రీవాత్సవ, తదితరులు పాల్గొన్నారు.