Apr 08,2023 00:03

ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
మండలంలోని చెరుకుంపాలెం పంచాయతీ మర్రిపాలెం గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధనలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టిక్కర్లను గృహాలకు అంటించారు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న పథకాల గురించి వివరించి, ప్రజాభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని, ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జెడ్పిటిసి ఒడుగుల జ్యోతి, వైస్‌ ఎంపీపీ సిహెచ్‌ చంద్రరాణి, సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, దాసరి నాగేశ్వరరావు, వైసిపి నాయకులు సింగిరెడ్డి రామకృష్ణ, ఎ.రాంబాబు, ఎం.కమలాదేవి, ఎం పండు, వై చిన్న తదితరులు పాల్గొన్నారు.
కొయ్యూరు : మండలంలోని రత్నంపేట గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు శుక్రవారం నిర్వహించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్‌, జెడ్పిటిసి వారా నూకరాజు, ఏఎంసీ చైర్‌పర్సన్‌ జైతి రాజులమ్మ, వైస్‌ ఎంపీపీ అప్పన వెంకట రమణ, వైసిపి మండల అధ్యక్షుడు జల్లి బాబులు, ఎంపీటీసీ బిడిజన అప్పారావు, సర్పంచ్‌లు ముసిలి నాయుడు, చంద్రరావు, వైసిపి నాయకులు బండి సుధాకర్‌, దోని బాబ్జి, పాటి శేఖర్‌, రీమల గంగాధర్‌, గాడి అచ్చిరాజు, గంగరాజు, వారా చిన నూకరాజు, పాటి గంగరాజు, ఎస్‌.కృష్ణ, కె.రవి పాల్గొన్నారు.